న్యూయార్క్: అమెరికాలో ఉన్న సిక్కులను ట్రంప్ సర్కారు(Trump Administration) టార్గెట్ చేసింది. సిక్కు డ్రైవర్ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో .. సెల్ఫ్ డిపోర్ట్ కావాలన్న ఉద్దేశాన్ని అమెరికా వ్యక్తం చేసింది. హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ ఓ వివాదాస్పద పోస్టర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. అక్రమంగా నివాసం ఉంటున్న సిక్కులను డిపోర్ట్ చేస్తున్న ప్రక్రియను ఆ పోస్టర్ ద్వారా అమెరికా సమర్ధించుకున్నది. అయితే జాత్యాంహకార రీతిలో ట్రంప్ సర్కారు పోస్టర్ ఉన్నట్లు విమర్శకులు ఆరోపిస్తున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ చేపడుతున్న చర్యలు కేవలం సిక్కులను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉందన్నారు.
హోంల్యాండ్ శాఖ పోస్టర్లో ట్రాన్స్ఫార్మర్ ముఖంతో ఒకరు, ఎదురుగా సిక్కు వ్యక్తి ఒకరు ఉన్నారు. మా రోడ్డు నుంచి వెళ్లిపోండి, మీకు డ్రైవింగ్ చేయడం రాదు.. మిస్టర్ సింగ్ అంటూ ఆ పోస్టర్లో రాశారు. సింగ్ అని పోస్టర్లో నేరుగా చెప్పడం వల్ల.. అది ఇండో అమెరికన్లను, ముఖ్యంగా సిక్కు గ్రూపులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. యూ డోన్ట్ నో హౌ టూ డ్రైవ్ అన్న ట్యాగ్‌లైన్ రాయడం.. ఇటీవల అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూచిస్తున్నట్లు తెలుస్తోంది.
My grandpa’s name was Dan Singh.
His father, Katha Singh, came to America from India decades ago to seek a better life. He became a raisin farmer in California.
My grandpa eventually took over the family business and also worked as a truck driver.
This post is racist and… https://t.co/cNMQeTo474
— Alec Nolan (@AlecOnFOX7) September 9, 2026
ట్రక్కు డ్రైవర్లుగా అమెరికాలో నివసిస్తున్న డాక్యుమెంటేషన్ లేని భారతీయుల్ని డిపోర్ట్ చేయాలని అమెరికా భావిస్తున్నది. కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లను ఇటీవల అమెరికా సర్కారు కఠినంగా స్క్రూట్నీ చేస్తున్నది. కమర్షియల్ డ్రైవర్స్ లైసెన్సు జారీ అంశంలో రూల్స్‌ను కూడా పకడ్బందీగా చేసింది. అయితే పోస్టర్లో సింగ్ అని పేరు పెట్టడం.. అది జాతివివక్షకు దారి తీస్తుందని విమర్శకులు అన్నారు.
డీహెచ్ఎస్ రిలీజ్ చేసిన పోస్టర్‌ను ద హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఖండించింది. ఆ స్టేట్మెంట్ ఇండియాకు వ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్నది. సింగ్ అంటే హిందువులు అని, వాళ్లు సిక్కులు అని, వాళ్లే అమెరికన్లు అని, వాళ్లు డ్రైవ్ చేస్తారని, కానీ హోంల్యాండ్ శాఖ చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నట్లు ఆ ఫౌండేషన్ తన ఎక్స్‌లో పేర్కొన్నది.
If you approach this nation with hostile intent, know this. We will defend ourselves. We will defend Americanism. We will defend our home.
Report Illegal Aliens on American Roads: 866-347-2423 pic.twitter.com/gJcDPA4CTH
— Homeland Security (@DHSgov) September 9, 2026