నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై టీఆర్ఎస్ వాయిదా తీర్మానం..
న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి పార్లమెంట్ ఉభయసభల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో రూల్ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత ఎంపీ కే కేశవ రావు కోరారు. ఇదే అంశాన్ని చర్చించాలని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.
నవోదయ విద్యాలయ సమితి.. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దేశంలోని అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఈ విద్యాలయాలు నాణ్యమైన విద్యలో అగ్రగామిగా ఉన్నాయి. రాష్ట్రాలలోని ఇతర సంస్థలకు ఇవి ఆదర్శంగా పనిచేస్తాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ప్రకటన జరిగింది. నవోదయ విద్యాలయాల స్థాపన విద్యా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది…, అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ఆ విద్యాలయాల ఏర్పాటు తప్పనిసరి. నూతన విద్యా సంవత్సరం అమలులోకి వస్తున్నందున ఈ అంశం చాలా ముఖ్యమైనదని వాయిదా తీర్మానంలో కేశవరావు, నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
నోటీసులు..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత మానికమ్ ఠాకూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. పెరిగిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన తన తీర్మానంలో కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బమ్లో మహిళలు, చిన్నారుల పట్ల జరిగిన అమానవీయ ఘటన గురించి జీరో అవర్‌లో చర్చించాలని బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కోరారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను వెనక్కి తీసుకోవాలని రాజ్యసభలో ఎంపీ సుశీల్ మోడీ జీరో అవర్ నోటీసు ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

