యజమానుల పేర్లు ఎందుకు దాచాలి..? : సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్
కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణదారులు యజమానుల పేర్లతో నేమ్బోర్డ్లను డిస్ప్లే చేయాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణదారులు యజమానుల పేర్లతో నేమ్బోర్డ్లను డిస్ప్లే చేయాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దుకాణాల్లో అందించే ఆహార పదార్ధాల వివరాలను ప్రదర్శించాలని కోరింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను విపక్షాలు సమర్ధించగా ఉత్తరాఖండ్ మాజీ సీఎం, బీజేపీ ఎంపీ త్రివేంద్ర సింగ్ రావత్ ఈ వ్యవహారంపై స్పందించారు.
సుప్రీంకోర్టు తీర్పును అగౌరవపరచలేమని పేర్కొన్నారు. ప్రభుత్వం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, అయితే దుకాణదారుల పేర్లను ఎందుకు దాచాలని ఆయన ప్రశ్నించారు. ఈ షాపు ఎవరిదనేది అక్కడ ఉంటుందని, సహజంగా షాపుల యజమాని ఎవరనే వివరాలు షాపులపై ఉంటాయని చెప్పారు. మరి ఎందుకు ఆ వివరాలను దాచాలని రావత్ ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.
ఈ ఉత్తర్వులతో తాము కొద్దిగా అసంతృప్తికి లోనయ్యామని చెప్పారు. కాగా, సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులను కాంగ్రెస్ స్వాగతించింది. సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకున్నదని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రాజకీయ లబ్ధి కోసం అనవసరంగా తెరపైకి తీసుకొచ్చిన వివాదం సమసిపోతుందని అన్నారు. న్యాయస్ధానం నిర్ణయంతో సమాజంలో శాంతి సామరస్యాలు, సామాజిక ఐక్యత వెల్లివిరుస్తాయని ఆకాంక్షించారు. మంచి నిర్ణయం తీసుకున్నందుకు సర్వోన్నత న్యాయస్ధానానికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
Read More :
Rangam Bhavishyavani | ఈసారి సమృద్ధిగా వర్షాలు.. పాడిపంటలు.. భవిష్యవాణిలో స్వర్ణలత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

