బ్లడ్థిన్నర్స్తో కొవిడ్ మరణాలకు చెక్!

టొరంటో : కరోనా వైరస్ స్వల్ప, మధ్యస్ధ లక్షణాలతో బాధపడుతూ దవాఖానలో చేరిన రోగులకు రక్తం పలుచన చేసే (బ్లడ్‌థిన్నర్స్) మందులను పూర్తి డోస్‌లో ఇవ్వడంతో బ్లడ్ కాట్స్ను నివారించి వైరస్ మరణాలను తగ్గించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా రోగుల్లో వైరస్ లోడ్ పెరిగి ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో వాపు, రక్తం గడ్డకట్టడంతో వ్యాధి తీవ్రత పెరగడం మరణాలకు దారితీస్తున్న క్రమంలో బ్లడ్‌థిన్నర్స్ చికిత్సతో వీటిని నియంత్రించవచ్చని అధ్యయనం పేర్కొంది.
కెనడాలోని సెయింట్ మైఖేల్ ఆస్పత్రి, అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆదఫ్ వెర్మంట్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆస్పత్రుల్లో చేరిన రోగులకు వీరు బ్లడ్థిన్నర్ హెర్పరిన్ను రోజూ తక్కువ డోస్‌లో ఇవ్వడంతో ఆయా రోగుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం నివారించినట్టు వెల్లడైంది. రోగుల శరీరంలో వాపు ప్రక్రియనూ బ్లడ్థిన్నర్ నివారించినట్టు పరిశోదకులు గుర్తించారు.
హెర్పరిన్ చికిత్సతో కొవిడ్-19 రోగుల్లో ఏ కారణం చేతనైనా మరణాలను 78 శాతం వరకూ తగ్గించినట్టు వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మేరీ కుష్మన్ తెలిపారు. ఇక స్వల్ప మధ్యస్థ లక్షణాలతో బాధపడే కొవిడ్-19 రోగులకే బ్లడ్థిన్నర్స్తో చికిత్స మెరుగైన ఫలితాలు రాబట్టిందని, ఇది ఐసీయూలో ఉన్న రోగులపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Blood Clots
- Covid-19
- new study
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

