Air Bags | న్యూఢిల్లీ: కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయడం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
కాగా, 2023 అక్టోబర్ నుంచి కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగుల నిబంధనను తీసుకొస్తున్నట్టు గతేడాది కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.