Suicides | బెంగళూరులో ఘోరం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య..!
Suicides | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఘోరం జరిగింది. చిన్నారులైన తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Suicides : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఘోరం జరిగింది. చిన్నారులైన తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం ప్రయాగరాజ్ (Prayagraj) కు చెందిన అనూప్ కుమార్ (Anup Kumar) (38) ఉద్యోగరీత్యా భార్యపిల్లలతో కలిసి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంటున్నాడు.
అనూప్ భార్య రాఖీ (35) గృహిణి. వీరికి అనుప్రియ (5), ప్రియాన్ష్ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనూప్ ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సంతోషంగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సోమవారం ఉదయం పనిమనిషి వచ్చి తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. దాంతో ఆమె ఇరుగుపొరుగుకు సమాచారం ఇచ్చింది.
వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. లోపల అనూప్, అతని భార్య రాఖీతోపాటు పిల్లలు విగతజీవులుగా పడివున్నారు. పిల్లలిద్దరి మృతదేహాలు బెడ్‌పై పడివుండగా.. అనూప్, రాఖీల మృతదేహాలు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాయి. దాన్నిబట్టి అనూప్ దంపతులు ముందుగా పిల్లలిద్దరికి విషమిచ్చి చంపి, తర్వాత వాళ్లు ఉరేసుకున్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఘటనపై పనిమనిషిని ఆరా తీయగా ఆమె పలు విషయాలు వెల్లడించిందని పోలీసులు తెలిపారు. పనిమనిషి తెలిపిన వివరాల ప్రకారం.. అనూప్ ఇంట్లో మొత్తం ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు వంట మనుషులు కాగా, ఒకరు పిల్లల కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. ఆర్థికంగా వారికి ఏ లోటూ లేదు. అయితే అనుప్రియ ఆరోగ్యం గురించి అనూప్ దంపతులు ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవారు.
ఈ క్రమంలో సోమవారం అనూప్ దంపతులు పుదుచ్చేరి పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు ఆదివారం రాత్రి లగేజ్‌ను కూడా సర్దిపెట్టుకున్నారు. సోమవారం ఉదయం వారు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ తీరా పనిమనిషి వచ్చి చూసేసరికి వారు పిల్లలను చంపేసి ఉసురు తీసుకున్నారు. పనిమనిషి వెల్లడించిన వివరాలను బట్టి.. తమ కూతురు అనారోగ్య సమస్య కారణంగానే దంపతులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

