MP Kalyan Banerjee | న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ సమావేశం రసాభాసగా సాగింది. సమావేశంలో అనుచితంగా ప్రవర్తించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. వక్ఫ్ (సవరణ) బిల్లుపై మంగళవారం జరిగిన సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయతో జరిగిన వాగ్వాదంలో ఎంపీ బెనర్జీ ఒక గాజు సీసాను పగులగొట్టి దానిని ప్యానల్ చైర్మన్ జగదాంబికా పాల్పైకి విసిరారు. ఈ క్రమంలో బెనర్జీ బొటన, చిటికెన వేలుకు గాయమైంది. బెనర్జీ చర్యను నిరసిస్తూ చేసిన తీర్మానాన్ని ప్యానెల్ 9-8తో ఆమోదించడంతో అతడిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.