Tirumala Darshan Quota | ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల
Tirumala Darshan Quota | 2026 మార్చి నెలకు సంబంధించి తిరుమలలో వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను టీటీడీ విడుదల చేసింది.
తిరుమల : 2026 మార్చి నెలకు సంబంధించి తిరుమలలో వివిధ దర్శనాల, గదుల కోటా (Tirumala Darshan Quota) వివరాలను టీటీడీ ( TTD ) విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో( Online ) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబర్ 20న ఉదయం 10 గంటల వరకు, ఆన్లైన్లో ఈ టికెట్లు పొందిన వారు డిసెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని వెల్లడించింది.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుందని వెల్లడించారు.
23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు , శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామన్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు , తిరుమల, తిరుపతిలలో గదుల అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వివరించారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

