మరో పెళ్లికి సిద్ధమైన ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి
న్యూఢిల్లీ : ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి మరో పెళ్లికి సిద్ధమైంది. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేను టీనా వివాహమాడనుంది. ప్రదీప్‌తో టీనా నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను టీనా దాబి, ప్రదీప్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేశారు.
2015 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టీనా దాబి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించిన దళిత యువతిగా ఆమె రికార్డులకెక్కింది. అదే ఏడాది రెండో ర్యాంకు సాధించిన అథార్ అమిర్ ఖాన్‌తో ప్రేమలో పడి 2018లో అతన్ని వివాహం చేసుకుంది. వీరి వివాహానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, నాటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు.

రాజస్థాన్ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడాకుల కోసం జైపూర్‌లోని కుటుంబ (ఫ్యామిలీ) కోర్టును టీనా ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన అనంతరం న్యాయస్థానం వీరిద్దరికీ 2021, ఆగస్టులో విడాకులు మంజూరు చేసింది. మెరుగైన పాలన అందిస్తూ అందరి నోళ్లల్లో నానిన టీనా దాబి, అథార్ అమిర్ ఖాన్.. విడాకులు తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

