Watch: యూనివర్సిటీ క్యాంపస్‌లో పులి సంచారం.. వీడియో వైరల్
Tigress’ Night Stroll | యూనివర్సిటీ క్యాంపస్‌లో పులి సంచరించింది (Tigress Stroll). మెయిన్ గేట్‌తోపాటు వీసీ చాంబర్ వద్ద అది తిరిగింది. అక్కడున్న వారు పులిని చూసి భయంతో పరుగులు తీశారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: యూనివర్సిటీ క్యాంపస్‌లో పులి సంచరించింది (Tigress Stroll). మెయిన్ గేట్‌తోపాటు వీసీ చాంబర్ వద్ద అది తిరిగింది. అక్కడున్న వారు పులిని చూసి భయంతో పరుగులు తీశారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్ శివారు ప్రాంతంలో జాగ్రన్ లేక్‌సిటీ ప్రైవేట్యూనివర్సిటీ ఉన్నది. శనివారం రాత్రివేళ ఆ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ఆడ పులి చొరబడింది. మెయిన్ గేట్‌తో పాటు వీసీ క్యాబిన్ వద్ద అది సంచరించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు పులిని చూసి భయాందోళన చెందారు. భయంతో సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత ఆ పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా, ప్రైవేట్ యూనివర్సిటీలో సంచరించిన ఆడ పులి టీ 123 అని అటవీశాఖ అధికారి అలోక్ పాఠక్ తెలిపారు. దానికి నాలుగు పిల్లలు ఉన్నాయని చెప్పారు. ఎనిమిది నెలల వయసున్న పిల్లలతో కలిసి అది అటవీ ప్రాంతం శివారులో తిరుగుతున్నదని అన్నారు. ఇటీవల ఒక డెయిరీ ఫామ్ వద్ద ఆవుపై దాడి చేసిందని, మిగతా పశువులు ప్రతిఘటించగా అక్కడి నుంచి పారిపోయిందని వెల్లడించారు. మరోవైపు యూనివర్సిటీలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
भोपाल ब्रेकिंग, कलियासोत में जागरण लेकसिटी के ऑफिस के पास जा पहुंचा #बाघ तड़के सुबह
लगातार बाघ की मूवमेंट बढ़ती हुई
पास में ही गार्ड सोया हुआ था, जान बचाकर भागा वहां से pic.twitter.com/6pHzCCKS11
— l N malviya (@LNMalviya6) August 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

