పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు!.. మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢనమ్మకాలకు ఓ మూడు నెలల చిన్నారి బలైంది. వ్యాధి తగ్గాలని చిన్నారి శరీరంపై 51 సార్లు ఇనుప రాడ్డుతో వాతలు పెట్టారు.
Pneumonia | మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలైంది. వ్యాధి తగ్గాలని చిన్నారి శరీరంపై 51 సార్లు ఇనుప కడ్డీతో వాతలు పెట్టారు. అయినా వ్యాధి తగ్గకపోవడంతో 15 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది అభం శుభం తెలియని ఆ పసికందు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గిరిజన ప్రాంతమైన షాదోల్ జిల్లాలోని సింగ్పుర్ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి నిమోనియా (Pneumonia) బారినపడింది. దీంతో చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా స్థానికంగా ఉన్న మంత్రగాళ్లకు చూపించారు. ఈ క్రమంలో మంత్రగాళ్లు పాప పొట్ట చుట్టూ కాల్చిన ఇనుప రాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. అయినప్పటికీ చిన్నారి ఆరోగ్యం కుదుట పడలేదుసరి కదా.. మరింత దిగజారింది. దీంతో వారు పసికందును స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారికి వ్యాధి సోకి అప్పటికే 15 రోజులు గడిచిపోవడంతో జరగరాని నష్టం జరిగిపోయింది.
నిమోనియాకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువై చిన్నారి మృతి చెందింది. పాపకు తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. శుక్రవారం శిశు, సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే వారు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఖననం చేసిన చోటుకెళ్లి.. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసేందుకు చర్యలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

