Maoists | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి
మావోయిస్టులకు (Maoists) మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని గుమ్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.
రాంచీ: మావోయిస్టులకు (Maoists) మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లోని గుమ్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. శనివారం ఉదయం గుల్మా జిల్లాలోని ఘాగ్రా అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వారిని సీపీఐ (మావోయిస్టు)కు చీలిక వర్గం జేజేఎంపీకి చెందిన వారిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని ఐజీ మిచెల్ ఎస్ రాజు వెల్లడించారు.
ఈ నెల 16న కూడా జార్ఖండ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. బొకారో జిల్లాలోని గోనియా ప్రాంతంలో ఉన్న బిర్హోర్డెరా అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులతోపాటు ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CPI (Maoist)
- Encounter
- ghagra
- Gumla
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

