ఆర్మీ జవాన్ వీరమరణం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఆర్మీ జవాన్ | జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ వీర మరణం పొందగా, ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. రాజ్‌పొరా ఏరియాలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు శుక్రవారం ఉదయం భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో అక్కడ బలగాలు కూంబింగ్ నిర్వహించగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మిలిటెంట్ల కాల్పులను బలగాలు తిప్పికొట్టాయి. ఆ ప్రదేశంలో కూంబింగ్ కొనసాగుతూనే ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హతమైన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పేర్కొన్నారు.
నిన్న ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నిన్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే ఈ ఇద్దరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారనేది నిర్ధారించలేదు. గత ఆరు నెలల నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో 61 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

