అమెరికాలో వేలాది మంది భారతీయులకు అవస్థలు..!
IT Professionals | అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డ వేలాది మంది భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయి, తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
IT Professionals | అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డ వేలాది మంది భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయి, తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తమ సంస్థల నుంచి తొలగించిన విషయం విదితమే. గతేడాది నవంబర్ నుంచి 2,00,000 మంది ఐటీ ఉద్యోగులను గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్ బుక్ వంటి సంస్థలు తొలగించినట్లు వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది.
తొలగించబడ్డ ఉద్యోగుల్లో 30 నుంచి 40 శాతం మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులంతా హెచ్ 1బీ, ఎల్ 1 వీసాలపై అక్కడ ఉంటున్నారు. అయితే అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి మాత్రమే విదేశీయులకు హెచ్ 1బీ వీసా జారీ చేస్తారు. అమెరికాలో తాత్కాలికంగా కొంత కాలం ఉండేందుకు
ఉద్దేశించినవి నాన్-ఇమిగ్రేషన్ వీసాలు. కాబట్టి హెచ్-1బీ వీసా నాన్-ఇమిగ్రేషన్ పరిధిలోకి వస్తుంది.
ఈ వీసా కలిగిన వారు ఉద్యోగం కోల్పోతే.. మరో 60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని చూసుకోవాల్సి వస్తుంది. అమెజాన్‌లో ఉద్యోగం చేసే ఓ మహిళ మూడు నెలల క్రితం అమెరికాకు వెళ్లారు. అయితే ఆమెకు మార్చి 20వ తేదీ ఆమె చివరి పని దినం అని కంపెనీ చెప్పింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఆవిడ 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోకపోతే, ఇండియా తిరిగి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు.
అయితే ఐటీ ఉద్యోగాలను కోల్పోయిన భారతీయులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని, భవిష్యత్‌పై చర్చోపర్చలు చేస్తున్నారు. కొత్త ఉద్యోగాలపై దృష్టి సారించారు. వీసా రెన్యువల్‌తో పాటు ఇతర వీసాలను పొందేందుకు సమాలోచనలు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

