Viral post | ప్రకృతి ఒడిలో నివసించేందుకు ఉద్యోగాన్ని వదిలేశాడు
అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ బ్రెటన్ (35) తనకు నచ్చిన దారిలో పయనించేందుకు ఏకంగా క్యాషియర్ ఉద్యోగాన్ని (Viral post) వదులుకున్నాడు.
న్యూయార్క్ : ఇష్టాలకు అనుగుణంగా స్వేచ్ఛగా బతకాలని అందరూ కోరుకున్నా జీవితంలో నెరవేర్చాల్సిన బాధ్యతల కోసం చాలా మంది తమ అభిరుచులతో రాజీ పడుతుంటారు. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ బ్రెటన్ (35) తనకు నచ్చిన దారిలో పయనించేందుకు ఏకంగా క్యాషియర్ ఉద్యోగాన్ని (Viral post) వదులుకున్నాడు.
సూపర్ మార్కెట్లో క్యాషియర్‌గా పనిచేసే బ్రెటన్ ప్రకృతి ఒడిలో నివసించాలని నిర్ణయించుకుని హవైలోని ట్రీ హౌస్‌కు మకాం మార్చాడు. ఉద్యోగానికి చెల్లుచీటీ ఇచ్చిన బ్రెటన్ పల్లె ఒడిలో పచ్చదనం మధ్య బతుకు పండిచుకుంటున్నాడు. హవై అటవీ ప్రాంతంలో ఒక్కడే తన కోసం ట్రీహౌస్ కట్టుకున్నాడు. తనకు అనువైన ప్రదేశం ఇదేనని హవైని ఎంపికచేసుకున్న బ్రెటన్ టిక్‌టాక్ ద్వారా తాను ఆర్జించిన మొత్తంతో ఆ ప్రాంతంలో భూమి కొనుగోలు చేశాడు. భారత కరెన్సీలో రూ. 24. 7 లక్షలు వెచ్చించి ఎకరం భూమి కొని ట్రీహౌస్ నిర్మించాడు.
అతడు కేవలం వర్షపు నీటిని సంరక్షిస్తూ అన్ని అవసరాలకు దాన్ని వినియోగిస్తాడు. తన పెరటిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో ఆహారం సమకూర్చుకుంటాడు. ప్రకృతికి దగ్గరగా ఉండే తన జీవన శైలిని ప్రతిబింబిస్తూ బ్రెటన్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌లు పెడుతుంటాడు. ఆధునిక జీవన పరిమితులను పక్కనపెడుతూ ప్రకృతితో తిరిగి మమేకమయ్యేలా ప్రజలకు సాయపడతానని రాబర్ట్ ఇన్స్టాగ్రాం బయోలో రాసుకొచ్చాడు.
Read More
Ashish Vidyarthi | 60 ఏండ్ల వయసులో ఆశీష్ విద్యార్థి రెండో పెళ్లి .. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే !
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- job
- quit
- US man
- viral post
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

