Corona : 15 నెలల తర్వాత ఆ జిల్లాలో నో కరోనా
Corona | మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 15 నెలల తర్వాత కరోనా రహిత జిల్లాగా నిలిచింది. ఆ జిల్లాలో 59,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,133 మంది మరణించారు. మొత్తంగా భండారా జిల్లాలో కరోనా సోకిన

ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తూనే ఉన్నది. దేశ వ్యాప్తంగా చూస్తే ఆ రాష్ట్రంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ రాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పలు జిల్లాల్లో కరోనా విస్తృతంగా వ్యాపించింది. అయితే మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 15 నెలల తర్వాత కరోనా రహిత జిల్లాగా నిలిచింది. ఆ జిల్లాలో 59,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,133 మంది మరణించారు. మొత్తంగా భండారా జిల్లాలో కరోనా సోకిన వారందరూ కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
గత కొద్ది రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి కూడా కోలుకుని నిన్న డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం రోజు ఆ జిల్లా వ్యాప్తంగా 578 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఆ జిల్లా కరోనా రహిత జిల్లాగా నిలిచింది. ఇక ఇప్పుడు అక్కడ కరోనా రోగులు లేరని వైద్యారోగ్య అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల సహకారంతో ఇది సాధించగలిగామని జిల్లా కలెక్టర్ సందీప్ కదం తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

