26/11 ముంబై దాడులకు 13 ఏళ్లు.. పాకిస్థాన్ దౌత్యవేత్తకు సమన్లు

న్యూఢిల్లీ: 2008, సెప్టెంబర్ 26వ తేదీన ముంబైలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించిన విషయం తెలిసిదే. ఆ దాడులకు నేటితో 13 ఏళ్లు నిండాయి. ఆ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవాలని ఇవాళ పాకిస్థాన్‌ను ఇండియా కోరింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై కమిషన్‌లో పనిచేస్తున్న దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. 26/11 ముంబై దాడులకు సంబంధించిన కేసును త్వరగా విచారించాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. ముంబై దాడులు జరిగే 13 ఏళ్లు గడిచినా.. 166 మంది బాధిత కుటుంబాలు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్నట్లు భారత ప్రభుత్వం చెప్పింది. ఇవాళ కేంద్ర విదేశాంగశాఖ ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు సమన్లు జారీ చేసింది. ఉగ్రదాడులకు పాల్పడిన వారిని శిక్షించడంలో పాకిస్థాన్ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. ద్వంద్వ వైఖరిని పాకిస్థాన్ వీడాలని భారత్ కోరింది. 26/11 ముంబై దాడుల దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులు, అమరులకు న్యాయం చేకూరే వరకు భారత్ ప్రతి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నందని విదేశాంగ శాఖ తెలిపింది.
India remembers the victims of 26/11 attacks on its 13th anniversary and continues to make every effort for swift justice.
— Randhir Jaiswal (@MEAIndia) November 26, 2021
Press Release: https://t.co/RJ5736NB43
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

