Thieves Steal Car With Children | పిల్లలున్న కారు చోరి చేసి 50 లక్షలు డిమాండ్.. తర్వాత ఏం జరిగిందంటే?
Thieves Steal Car With Children | ఇద్దరు పిల్లలతో ఆగి ఉన్న కారును ఒక వ్యక్తి చోరీ చేశాడు. వారి పేరెంట్స్‌కు ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 20 వాహనాల్లో ఆ కారు కోసం వెతికారు. మూడు గంటల తర్వాత ఒక చోట వదిలేసిన కారులో ఉన్న పిల్లలను గుర్తించి కాపాడారు.
న్యూఢిల్లీ: ఇద్దరు పిల్లలతో ఆగి ఉన్న కారును ఒక వ్యక్తి చోరీ చేశాడు. (Thieves Steal Car With Children) వారి పేరెంట్స్‌కు ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 20 వాహనాల్లో ఆ కారు కోసం వెతికారు. మూడు గంటల తర్వాత ఒక చోట వదిలేసిన కారులో ఉన్న పిల్లలను గుర్తించి కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ప్రయాణించారు. 11 ఏళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడ్ని కారులో వదిలేసి ఇంజిన్ ఆన్‌లో ఉంచి స్వీట్లు కొనేందుకు షాపు వద్దకు వెళ్లారు.
కాగా, ఇంజిన్ ఆన్‌లో ఉన్న కారులోకి ఒక వ్యక్తి ఎక్కాడు. ఇద్దరు పిల్లలతోపాటు డ్రైవ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వీట్లు కొనుగోలు చేసి వచ్చిన దంపతులు పిల్లలున్న తమ కారు మాయం కావడంతో షాక్ అయ్యారు. ఇంతలో పిల్లల తల్లికి ఫోన్ చేసిన ఆ వ్యక్తి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో మరింత ఆందోళన చెందిన భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు.
మరోవైపు కారు చోరీ, పిల్లల కిడ్నాప్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. సుమారు 50 మంది పోలీసులు 20 వాహనాల్లో ఆ కారు, అందులోని పిల్లల కోసం వెతికారు. పలు రూట్లు మారిన ఆ వాహనాన్ని ట్రేస్ చేసి వెంటపడ్డారు. సుమారు మూడు గంటల పాటు 150 కిలోమీటర్ల మేర ఛేజింగ్ చేశారు. చివరకు సామాపూర్ బద్లీ ప్రాంతంలో రోడ్డు పక్కన వదిలేసిన కారును గుర్తించారు. అందులోని ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులకు వారిని అప్పగించారు.
కాగా, పరారైన నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Delhi Cops
- Rescue
- siblings
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

