పైసలు లేని ఇంటికి తాళం ఎందుకు?

చోరీకి పాల్పడిన ఇంట్లో డబ్బు లేకపోవడంతో నోట్ రాసిన దొంగ
భోపాల్, అక్టోబర్ 11: తాళంవేసిన ఓ ప్రభుత్వాధికారి ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ భారీ మొత్తంలో డబ్బు, దస్కాన్ని దోచుకుందామనుకున్నాడు. అయితే, ఆ ఇంట్లో కొంత డబ్బే అతడికి దొరికింది. దీంతో నిరాశకు గురైన ఆ చోరుడు.. ఏకంగా ఆ అధికారికే ఓ లేఖ రాసిపెట్టి వెళ్లాడు. ఆ లేఖను సోమవారం స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఇంతకీ దొంగ రాసిన ఆ లేఖలో ఏమున్నదంటే.. ‘జబ్ పైసే నహీ థే.. తో.. లాక్ నహీ కర్నా కలెక్టర్ (కలెక్టర్ గారూ.. ఇంట్లో డబ్బు లేనప్పుడు.. ఇంటికి తాళం వేయకూడదు) అని రాసి ఉంది. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ త్రిలోచన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సింగ్ ఇంట్లో నుంచి వెళ్తూ ఆ దొంగ రూ.30 వేల నగదు, కొన్ని నగలను తీసుకుపోయినట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

