నేటి నుంచి వచ్చే మార్పులివే!
ప్రజల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాల్లో నవంబర్ 1వ తేదీ నుంచి పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీమా క్లెయిమ్‌కు కేవైసీ తప్పనిసరి, ఎల్పీజీ సిలిండర్ డెలివరీకి ఓటీపీ, రైల్వే సర్వీసుల కొత్త టైం టేబుల్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
న్యూఢిల్లీ: ప్రజల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాల్లో నవంబర్ 1వ తేదీ నుంచి పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీమా క్లెయిమ్‌కు కేవైసీ తప్పనిసరి, ఎల్పీజీ సిలిండర్ డెలివరీకి ఓటీపీ, రైల్వే సర్వీసుల కొత్త టైం టేబుల్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
సిలిండర్ హోం డెలివరీకి ఓటీపీ:
ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకొనే సమయంలో వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. నవంబర్ 1 నుంచి ఇంటివద్ద డెలివరీ సమయంలో ఆ ఓటీపీ చెప్తేనే సిలిండర్ ఇస్తారు.
రైళ్ల కొత్త టైం టేబుల్:
పలు దూర ప్రయాణ రైలు సర్వీసులకు సంబంధించి రైల్వే శాఖ కొత్త టైం టేబుల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం 13 వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల టైమింగ్స్ మారుతాయి. దేశవ్యాప్తంగా నడిచే 30 రాజధాని రైళ్ల టైమింగ్స్‌లో కూడా నవంబర్ 1 నుంచి మార్పులు ఉంటాయి.
జీఎస్టీ రిటర్న్‌కు హెచ్ఎస్ఎన్ కోడ్:
నవంబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్ సమయంలో నాలుగు అంకెల హెచ్ఎస్ఎన్ కోడ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.
ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌కు కేవైసీ:
హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) నవంబర్ 1 నుంచి కేవైసీని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ కేవైసీ అనేది స్వచ్ఛందంగా ఉన్నది. కేవైసీ తప్పనిసరి విషయంలో డెడ్లైన్లో ఎలాంటి మార్పులు ఉండవని ఐఆర్డీఏఐ ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

