గోవాలో హంగ్ ఏర్పడే ఛాన్స్.. మొదలైన క్యాంప్ రాజకీయాలు
Goa polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోబోతున్నది. ఆ మూడు రాష్టాల్లో
పనాజీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోబోతున్నది. ఆ మూడు రాష్టాల్లో మెజారిటీ స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకుపోతున్నది. ఇక పంజాబ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. అక్కడ అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నది.
మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగాను 80కి పైగా స్థానాల్లో ఆప్ లీడింగ్‌లో కొనసాగుతున్నది. అయితే మరో రాష్ట్రం గోవాలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడుస్తున్నది. ఉదయం 11 గంటల సమయానికి రెండు పార్టీలో దాదాపు సమాన స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. దాంతో రెండు పార్టీలు అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చేజారీపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
తమ పార్టీల తరఫున బరిలో నిలిపిన అభ్యర్థులను క్యాంపులకు తరలించి కాపలా కాస్తున్నాయి. గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాల్లో గెలిచాయి. కానీ, బీజేపీ తన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించి స్వతంత్రులు, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి మరింత జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే డికే శివకుమార్ తదితర సీనియర్లు గోవాలో తిష్టవేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

