అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చినట్లే.. బీహార్ సీఎం నితీశ్ కూడా.. : బీజేపీ నేత కైలాశ్
Boyfriends | అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను (Boyfriends) మార్చినట్లే బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) కూడా అధికారం కోసం భాగస్వామ్య పార్టీలను మారుస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
పట్నా: అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను (Boyfriends) మార్చినట్లే బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) కూడా అధికారం కోసం భాగస్వామ్య పార్టీలను మారుస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియా అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారు, ఎవరికి చెయ్యిస్తారనే విషయం ఎవరికీ తెలియదని విమర్శించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొన్ని రోజుల క్రితం తాను విదేశాలకు వెళ్లానని, ఇక్కడ మహిళలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఏ క్షణంలో మార్చుతారని తనతో ఒకరు చెప్పారు. ఇక్కడ బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అచ్చం అలానే వ్యవహరిస్తారు. ఆయన ఎప్పుడు ఎవరి చేయి పట్టుకుంటారో మనకు తెలియదని వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతున్నది. బీజపీ నాయకులకు మహిళలపై ఉన్న గౌరవం ఇదేనా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కైలాశ్ వీడియో కాంగ్రెస్ నేత రన్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. కాగా, గతవారం.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నితీశ్.. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బందన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
भाजपा के राष्ट्रीय महासचिव द्वारा नारी सम्मान का नया नमूना 👇 pic.twitter.com/DEGr5ojM5r
— Randeep Singh Surjewala (@rssurjewala) August 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

