Shocking Video: యూపీలో దారుణం.. ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో టాయిలెట్ క్లీనింగ్!
యూపీలో దారుణం జరిగింది. ఓ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం ఆ పాఠశాల చిన్నారులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించాడు. అక్షరాలు దిద్దాల్సిన చేతులతో పారిశుధ్య పనులు చేయించాడు. హెచ్ఎంకు భయపడి విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు హెచ్ఎంపై నెటిజన్లు మండిపడ్డారు.
యూపీలో దారుణం జరిగింది. ఓ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం ఆ పాఠశాల చిన్నారులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించాడు. అక్షరాలు దిద్దాల్సిన చేతులతో పారిశుధ్య పనులు చేయించాడు. హెచ్ఎంకు భయపడి విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రంచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు హెచ్ఎంపై నెటిజన్లు మండిపడ్డారు.
ఈ సంఘటన బల్లియా జిల్లాలోని సోహవాన్ ప్రాంతంలోని పిప్రా కాలా వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఈ వీడియోలో పాఠశాల ప్రిన్సిపాల్ సూచనల మేరకు చిన్నారులు టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్నారు. ఓ బాలుడు టాయిలెట్ క్లీనర్ పట్టుకోగా, మరో బాలుడు మరుగుదొడ్డిని బ్రష్‌తో క్లీన్ చేసి, మగ్గుతో నీళ్లు పోస్తూ కనిపించాడు. మరుగుదొడ్డి కడగకుంటే దానికి తాళం వేస్తానని హెచ్ఎం బెదిరింపులకు గురిచేసినట్టు తెలిసింది. ఈ విషయంపై బల్లియా జిల్లా ప్రాథమిక విద్యాధికారి మణిరామ్‌సింగ్ మాట్లాడుతూ, తాను వీడియో చూశానని, విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత హెచ్ఎంపై చర్యలు తీసుకుంటామన్నారు.
Primary School Students Made To Clean Toilet by Principle in Ballia, Uttar Pradesh.
The incident was reported from Pipra Kala Primary School of Sohav Block in Ballia. pic.twitter.com/oYaqqBhFJA
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) September 8, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

