Vasuki Indicus | గుజరాత్లో అతిపెద్ద పాము శిలాజం.. వాసుకి ఇండికస్గా నామకరణం
గుజరాత్‌లోని కచ్‌లో లభించిన శిలాజాలపై ఐఐటీ రూర్కీ జరిపిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
- వాసుకి ఇండికస్గా పేరు పెట్టిన పరిశోధకులు
Vasuki Indicus | న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: గుజరాత్‌లోని కచ్‌లో లభించిన శిలాజాలపై ఐఐటీ రూర్కీ జరిపిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. పనాంద్రో లిగ్నైట్ మైన్‌లో దొరికిన 27 ఎముకలు ప్రపంచంలోనే అతి పెద్ద పాము వెన్నెముకకు చెందినవని పరిశోధకులు గుర్తించారు. ఈ పాము దాదాపుగా 11 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చని వీరు భావిస్తున్నారు.
ఇది ప్రపంచంలో ఇప్పటివరకు అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన టైటానోబోవాను పోలి ఉందని తెలిపారు. భారీ సైజులో ఉన్నందున ఈ పాము కూడా అనకొండలా మెల్లిగా కదలగలిగేదని భావిస్తున్నారు. పరిశోధకులు ఈ పాముకు శివుడి మెడలోని పాము పేరైన ‘వాసుకి’ కలిసి వచ్చేలా ‘వాసుకి ఇండికస్’ అని పేరు పెట్టారు. ఈ పాము ఒకప్పుడు భారత్, ఆఫ్రికా, యూరోప్‌లో జీవించి అంతరించిపోయిన మాడ్ట్సోయిడై కుటుంబానికి చెందినదిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఈ శిలాజాలు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

