మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు
Prahlad Joshi: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021ను ఈ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లోక్సభలో ఈ ఉదయమే బిల్లును

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021ను ఈ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లోక్సభలో ఈ ఉదయమే బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటింగ్ విధానంలో ఆ బిల్లును సభ ఆమోదించింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ఎలాంటి చర్చ జరుపకుండా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఆమోదించడాన్ని తప్పుబట్టాయి.
దీనిపై స్పందించిన ప్రహ్లాద్ జోషి.. వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందినప్పుడే వాటిపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. అయితే, ప్రతిపక్షాలన్నీ ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయని, వారి డిమాండ్లను గౌరవించి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తుంటే సభలో ప్రతిపక్షాలు గొడవ చేశాయని చెప్పారు. తాను ప్రతిపక్షాలను ఒక్కటే అడుగుతున్నానని, వారి ఉద్దేశం ఏమిటో చెప్పాలని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం మాత్రం క్లియర్గా ఉన్నదని జోషి చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేయాలని తాము నిర్ణయించాం. అందులో భాగంగానే బిల్లును లోక్సభ ఆమోదించింది. మధ్యాహ్నం రాజ్యసభ కూడా ఆమోదించనుంది. కాబట్టి ప్రతిపక్షాలు రాజ్యసభలో బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరుతున్నాం అని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

