న్యూయార్క్: అంగారకుడు, చంద్రుడిపై మనిషి జీవించగలుగుతాడా? అన్న పరిశోధనలు కొనసాగుతుండగానే, శాస్త్రవేత్తల కన్ను గ్రహశకలాలపైనా పడింది. గ్రహ శకలాలను ఆవాస స్థలాలుగా ఎందుకు మార్చుకోకూడదు? అని ఆలోచించిన శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. గ్రహశకలానికి రంధ్రం చేసి, దానిలో బిల్డింగులు కట్టేలా ప్లాన్లు రెడీ చేస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి కోసం ఆ ఆస్టరాయిడ్కు కృత్రిమ భ్రమణాలు కూడా కల్పించాలని చూస్తున్నారు. దానికోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్, యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ శాస్త్రవేత్తల బృందం ఈ బృహత్తర ప్రయోగానికి నడుం బిగించింది. ముందుగా, ఒక చిన్న ఆస్టరాయిడ్‌పై ప్రయోగాలు నిర్వహించనున్నారు.