Supreme court | ప్రభుత్వ విధాన నిర్ణయాలను అడ్డుకోలేం.. బీహార్ కులగణనపై సుప్రీంకోర్టు
బీహార్ ప్రభుత్వం కుల గణన సమాచారాన్ని వెల్లడించకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కోర్టు పరిశీలనలో ఉండగా సర్వేకు సంబంధించిన వివరాలను ఎందుకు వెల్లడించారని బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Supreme court | న్యూఢిల్లీ, అక్టోబర్ 6: బీహార్ ప్రభుత్వం కుల గణన సమాచారాన్ని వెల్లడించకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కోర్టు పరిశీలనలో ఉండగా సర్వేకు సంబంధించిన వివరాలను ఎందుకు వెల్లడించారని బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగిలిన డాటాను ప్రజా బాహుళ్యానికి వెల్లడించకుండా ఆదేశాలివ్వడానికి నిరాకరిస్తూ.. ఒక వేళ డాటాకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే దానిని పరిశీలిస్తామని పేర్కొంది.
బీహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను కొనసాగించవచ్చంటూ పాట్నా హైకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. న్యాయస్థానంలో విచారణలో ఉండగా బీహార్ ప్రభుత్వం సర్వే వివరాలు విడుదల చేయడాన్ని ప్రశ్నించిన పిటిషనర్లు, తదుపరి వివరాలు ప్రకటించకుండా అడ్డుకోవాలని సుప్రీంని కోరారు. దీనికి నిరాకరించిన సుప్రీం.. ప్రభుత్వ చర్యను తాము నిరోధించమని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పరిశీలిస్తామని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

