Home
National
The Buddhist Teacher Dalai Lama Who Was Severely Criticized For Behaving Inappropriately Towards The Boy Has Apologized To The Boy And His Family
బాలుడికి దలైలామా క్షమాపణలు
బాలుడి పట్ల అనుచితంగా ప్రవర్తించి తీవ్ర విమర్శలపాలైన బౌద్ధమత గురువు దలైలామా.. బాలుడికి, అతడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో సందేశం విడుదల చేశారు. దలైలామా వద్దకు వెళ్లిన ఓ బాలుడు ‘మిమ్మల్ని హగ్ చేసుకోవాలని ఉన్నది’ అని కోరాడు.
న్యూఢిల్లీ: బాలుడి పట్ల అనుచితంగా ప్రవర్తించి తీవ్ర విమర్శలపాలైన బౌద్ధమత గురువు దలైలామా.. బాలుడికి, అతడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో సందేశం విడుదల చేశారు. దలైలామా వద్దకు వెళ్లిన ఓ బాలుడు ‘మిమ్మల్ని హగ్ చేసుకోవాలని ఉన్నది’ అని కోరాడు. ఆ సమయంలో బాలుడి పెదాలపై దలైలామా ముద్దు పెట్టడంతోపాటు తన నాలుకను నోటితో తాకాలని బాలుడిని కోరారు.
ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా కావడంతో నెటిజన్ల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ‘వీడియోలో వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే.. అందుకు ఆ బాలుడికి, అతడి కుటుంబానికి దలైలామా క్షమాపణలు తెలియజేస్తున్నారు. తనను కలిసే వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులతో దలైలామా సరదాగా ఉంటారు. అయితే వీడియోలో జరిగిన దానికి దలైలామా విచారం వ్యక్తం చేస్తున్నారు’ అని దలైలామా బృందం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

