న్యూఢిల్లీ: ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె (22)పై బుధవారం లైంగిక దాడి చేసి హతమార్చిన 23 ఏండ్ల నిందితుడు రాహుల్ ఈ అఘాయిత్యానికి ముందు రాజస్థాన్‌లోని అళ్వార్‌లో మరో మహిళపై అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. రాహుల్ మంగళవారం రాత్రి రాజస్థాన్‌లోని అళ్వార్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసి, ఆమెను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. మంగళవారం అక్కడి నుంచి హైవేపైకి వచ్చి ఒక అంబులెన్స్‌ను ఆపాడు. తనను ఢిల్లీ తీసుకువెళితే ఐదారు వేలు ఇస్తానని డ్రైవర్‌తో చెప్పాడు. ఢిల్లీ చేరిన తర్వాత డబ్బులు ఇవ్వకుండానే అంబులెన్స్ దిగి పారిపోయాడు. అంతకుముందు పనిచేసిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేరన్న విషయం గమనించి ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఆతని కుమార్తెపై లైంగిక దాడిచేసి హత్య చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి వివరాలు రాబడుతున్నారు.