కుల్గాంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి
Terrorists kill 2 non-local labourers | జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో జిల్లాలో ఇద్దరు వలస కూలీలను కాల్చి చంపారు. మరో వ్యక్తికి

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో జిల్లాలో ఇద్దరు వలస కూలీలను కాల్చి చంపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వాన్పోలో వలస కార్మికులు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ముగ్గురికి తూట గాయాలు కాగా.. ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు రాజా రేషి దేవ్, జోగిందర్ రేషి దేవ్‌గా గుర్తించారు. వీరి స్వస్థలం బిహార్.
గాయపడ్డ మరో వ్యక్తిని చున్ చున్ రేషి దేవ్‌గా గుర్తించారు. సదరు వ్యక్తిని దవాఖానకు తరలించి, వైద్యం అందిస్తున్నారు. అయితే, కాల్పులకు తెగబడ్డ జాడ తెలియరాలేదు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. వారి జాడ కోసం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. గడిచిన రెండు రోజుల్లో ఉగ్రవాదులు కాల్పులకు దిగడం ఇది మూడోసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

