Harbhajan | ఆ ఫొటో బయటికి వచ్చిన పది రోజులకే హర్భజన్ కీలక ప్రకటన.. ఆంతర్యం?
క్రికెటర్ హర్భజన్ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పేశారు. ఇదే గమనించాల్సిన అంశం. ఇప్పుడు హర్భజన్ ఏం చేస్తారన్నదే ప్రశ్న.

సరిగ్గా పది రోజుల క్రితం. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూతో క్రికెటర్ హర్భజన్ సింగ్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా సిద్దూ పోస్ట్ చేశారు. అన్నీ సంభవమే అన్న క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది జరిగి పది రోజులే అయ్యింది. క్రికెటర్ హర్భజన్ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పేశారు. ఇదే గమనించాల్సిన అంశం. ఇప్పుడు హర్భజన్ ఏం చేస్తారన్నదే ప్రశ్న. ఇక నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తారని కొందరు అంటుంటే.. మరి కొందరు ఏదో ఒక ఐపీఎల్ టీమ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతారని మరి కొందరు అంటున్నారు. సిద్దూ మాత్రం హర్భజన్‌ను రాజకీయాల్లోకి లాగాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని సమాచారం.

అన్నీ కుదిరితే హర్భజన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జలంధర్ నుంచి బరిలోకి దిగడానికి వేదిక సిద్ధమైపోయిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భజ్జీని చేర్చుకోవాలని అటు బీజేపీ కూడా తహతహలాడింది. కానీ.. తాను బీజేపీలో చేరడం లేదని భజ్జీ అధికారికంగా ప్రకటన కూడా చేశారు. కాంగ్రెస్‌లో చేరికపై వస్తున్న వార్తలను మాత్రం భజ్జీ ఎక్కడా ఖండించడం లేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి వస్తున్నారని పంజాబ్ కాంగ్రెస్ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరికపై, జలంధర్ నుంచి పోటీ చేయడంపై మాత్రం భజ్జీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. సిద్దూను కలిసిన పది రోజులకు హర్భజన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం మాత్రం గమనించాల్సిన అంశం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

