Mobile Portability | న్యూఢిల్లీ: సిమ్ స్వాప్ మోసాలను అరికట్టేందుకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలను సవరించింది. దొంగతనానికి గురైన లేదా దెబ్బతిన్న సిమ్ కార్డుకు బదులుగా కొత్త సిమ్ కార్డును పొందినా, కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేసినా, ఆ తేదీ నుంచి ఏడు రోజుల వరకు వేరే నెట్‌వర్క్‌కు మారకూడదు.
టెలికం ఆపరేటర్లు ఈ ఏడు రోజు ల్లో యూనిక్ పోర్టింగ్ కోడ్‌ను యూజర్‌కు పంపించకూడదు. జూలై 1 నుంచి కొత్త ని బంధనలు అమల్లోకి వస్తాయి. వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకుంటే, యూజర్ తన ప్రస్తుత టెలికం ఆపరేటర్‌కు పోర్ట్ అని మెసే జ్ పంపిస్తే, 8 అంకెల కోడ్ వస్తుంది. దాన్ని మారాలనుకుంటున్న ఆపరేటర్‌కు ఇవ్వాలి.