‘మహా’ రైతుకు రూ.5 వేల తక్షణ కరువు సాయం
ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు సాగు, తాగు నీటికి కష్టాలు.. వెరసి తెలంగాణవ్యాప్తంగా రైతాంగం, ప్రజలు అరిగోస పడుతున్నారు. ఎల్ నినోను ఎదుర్కోవడానికి ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయడంలో రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.
- అన్నదాతలకు ఇస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్
- సాయాన్ని మరింత పెంచాలని కేంద్ర మంత్రి అథవాలే విజ్ఞప్తి
- తెలంగాణలో అన్నదాతలను పట్టించుకోని రేవంత్ సర్కార్
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు సాగు, తాగు నీటికి కష్టాలు.. వెరసి తెలంగాణవ్యాప్తంగా రైతాంగం, ప్రజలు అరిగోస పడుతున్నారు. ఎల్ నినోను ఎదుర్కోవడానికి ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయడంలో రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ, రేవంత్ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకొన్న పాపానపోలేదు. అయితే, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఎల్నినోతో పంటలను కోల్పోయిన రైతులకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రూ. 5 వేల తక్షణ కరువు సాయాన్ని అందిస్తున్నది.
305 తాలూకాల్లో సాయం
ఎల్నినో ప్రభావంతో మహారాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 305 తాలూకాలను కరువుపీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రానున్నది పండుగల సీజన్. ఈ నేపథ్యంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాథమికంగా ఒక్కో రైతుకు రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీపావళికి ముందే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు వెల్లడించింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంట కోల్పోయిన రైతులను ఆర్థికంగా ఆదుకొనే చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరింత పెంచేలా చర్యలు
మహారాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించడంపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే స్వాగతించారు. అయితే, ఈ సాయం సరిపోదని, మరింతగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఫడ్నవీస్తో మాట్లాడుతానని, కేంద్రం నుంచి కూడా సాయం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

