Son Hires Shooters To Kill Father | తగినంత డబ్బులు ఇవ్వనందుకు.. షూటర్లతో తండ్రిని చంపించిన 16 ఏళ్ల కొడుకు
Son Hires Shooters To Kill Father | ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఇవ్వనందుకు 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించాడు. దీని కోసం ముగ్గురు షూటర్లను నియమించాడు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ముగ్గురు వ్యక్తులతోపాటు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు.
లక్నో: ఖర్చుల కోసం తగినంత డబ్బులు ఇవ్వనందుకు 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించాడు. దీని కోసం ముగ్గురు షూటర్లను నియమించాడు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ముగ్గురు వ్యక్తులతోపాటు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. (Son Hires Shooters To Kill Father) ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 21న పట్టి ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు 50 ఏళ్ల వ్యాపారవేత్త మహ్మద్ నయీమ్‌పై కాల్పులు జరిపి చంపారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు, హంతకులైన పీయూష్ పాల్, శుభమ్ సోనీ, ప్రియాంషులను అరెస్ట్ చేశారు.
కాగా, ముగ్గురు నిందితులను ప్రశ్నించిన పోలీసులు వారు చెప్పింది విని షాకయ్యారు. మహ్మద్ నయీమ్‌ను హత్య చేసేందుకు ఆయన 16 ఏళ్ల కుమారుడు ఆ షూటర్లను నియమించుకున్నట్లు తెలుసుకున్నారు. తండ్రిని చంపితే ఆరు లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్న ఆ యువకుడు వారికి రూ.1.5 లక్షలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. కోరికలు తీర్చుకునేందుకు తరచుగా షాపులో డబ్బులు లేదా ఇంట్లోని నగలను దొంగిలించేవాడని చెప్పారు. గతంలో కూడా తండ్రిని చంపేందుకు ప్లాన్ వేసిన అతడు విఫలమయ్యాడని పోలీసులు తెలిపారు. నిందితుడైన మైనర్ బాలుడ్ని బాలల కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

