Teen Daughter Kills Father | తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడని.. గొడ్డలితో నరికి తండ్రిని చంపిన కూతురు
Teen Daughter Kills Father | నిత్యం తాగి వచ్చి తల్లిని కొడుతున్న తండ్రిని మైనర్ కుమార్తె కడతేర్చింది. గొడ్డలితో నరికి చంపింది. తండ్రిని ఎవరో హత్యచేసినట్లు పోలీసులకు చెప్పింది. అయితే కూతురే తండ్రిని చంపినట్లు దర్యాప్తులో తేలింది.
రాయ్‌పూర్: నిత్యం తాగి వచ్చి తల్లిని కొడుతున్న తండ్రిని మైనర్ కుమార్తె కడతేర్చింది. గొడ్డలితో నరికి చంపింది. (Teen Daughter Kills Father) తండ్రిని ఎవరో హత్యచేసినట్లు పోలీసులకు చెప్పింది. అయితే కూతురే తండ్రిని చంపినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాగ్బహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో నివసించే 50 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. గొడ్డలితో నరికి చంపిన అతడి మృతదేహం మంచంపై పడి ఉన్నట్లు ఏప్రిల్ 22న ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. తన తండ్రిని ఎవరో హత్య చేసినట్లు 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు చెప్పింది.
కాగా, ఏప్రిల్ 21న రాత్రివేళ తల్లి ఇంట్లో లేకపోవడంతో కూతురు ఒక్కతే ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. తాగి వచ్చిన తండ్రి ఆమెతో గొడవపడటంతో గొడ్డలితో నరికి చంపిందని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు నిత్యం తాగి వచ్చి తల్లిని, తనను కొట్టడం, ఇంట్లో గొడవపడటం సహించలేక గొడ్డలితో నరికి తండ్రిని చంపినట్లు కూతురు ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో మైనర్ బాలికను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

