Gurugram | హర్యానాలోని గురుగ్రామ్‌లో(Gurugram) భారీ వర్షాలతో జనజీవనం స్తభించిపోయింది. భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ఓ కార్పొరేట్ ఉద్యోగి( Techie works)తన పనికి ఆటంకం కలుగొద్దని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన ల్యాప్‌టాప్‌తో నీళ్లలో రోడ్డుపై ఆగిపోయిన తన క్యాబ్ పైకప్పుపైకి ఎక్కి వైరల్ అయ్యాడు. ఆగిపోయిన తన క్యాబ్ పైకప్పుపైకి ఎక్కి, ల్యాప్‌టాప్‌ను తెరిచి, అక్కడి నుంచే ఆఫీస్ కాల్స్ మాట్లాడటం, పని చేయడాన్ని చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతమైన వినోదాన్ని, చర్చను లేవనెత్తింది. ఆధునిక సంస్కృతిలో మారిన మనిషి జీవన శైలి, కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లు ఉరుకులు పరుగులతో పని ఒత్తిడికి లోనై జీవితాల్ని చిధ్రం చేసుకుంటున్న అంశాల్ని ఎత్తి చూపాయి.
వరదల్లోనూ వర్క్ ఆగలేదు..!
ట్రాఫిక్‌లో కారు కప్పుపై కూర్చొని ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న టెక్కీ
గుర్గావ్లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమై తీవ్రంగా స్తంభించిన ట్రాఫిక్
నీటితో నిండిపోయిన రోడ్డుపై చిక్కుకుపోయిన ఓ ఉద్యోగి
దీంతో తన కారు కప్పుపై కూర్చొని ల్యాప్‌టాప్‌లో పని… pic.twitter.com/5xcqW215S0
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026