IT Raids | నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. రూ.1500 కోట్ల నగదు స్వాధీనం
IT Raids | ప్రముఖ నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేశారు. (IT Raids) భారీగా పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. లెక్కల్లో చూపని రూ.1500 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
లక్నో: ప్రముఖ నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేశారు. (IT Raids) భారీగా పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. లెక్కల్లో చూపని రూ.1500 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. భూటానీ ఇన్ఫ్రా, గ్రూప్ 108, అడ్వెంట్, లాజిక్స్ నిర్మాణ గ్రూపు సంస్థలు భారీగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుమారు 250 మంది ఐటీ అధికారులు 40 బృందాలుగా ఏర్పడ్డారు. మహాకాల్ పేరుతో రైడ్స్ ఆపరేషన్ నిర్వహించారు. నాలుగు నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో ఆరు రోజులపాటు సోదాలు జరిపారు. లెక్కల్లో చూపని సుమారు రూ.1500 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, భూటానీ గ్రూప్ ఉద్యోగులు దాచిన రెండు పెన్ డ్రైవ్‌లను ఐటీ అధికారులు కనుగొన్నారు. ఆ కంపెనీకి భారీ మొత్తంలో డబ్బు అందిన సమాచారం అందులో ఉంది. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఆ గ్రూప్ మొత్తం రూ. 429 కోట్ల నగదు పొందినట్లు వివరాలున్నాయి. 2019 నుంచి మూడేళ్లలో రూ. 595 కోట్ల నగదును భూటానీ గ్రూప్ ఆమోదించినట్లు పెన్ డ్రైవ్‌లోని డేటా ద్వారా ఐటీ అధికారులు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఆ సంస్థ ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. పన్ను ఎగవేత హమీతో భారీగా ప్రకటనలు ఇవ్వడంతోపాటు పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ఖచ్చితమైన క్యాష్ రిటర్న్‌లు అందించినట్లు ఐటీ అధికారుల దర్యాప్తులో బయటపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

