నీట్ కీ చెక్ చేసిన అనంతరం.. బాలిక అదృశ్యం

చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) విషాదాలు తమిళనాడును విడటం లేదు. ఈ పరీక్షలో అర్హత సాధించలేమన్న భయంతో ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా నీట్ రాసిన మరో బాలిక ఇంటి నుంచి అదృశ్యమైంది. నమక్కల్ జిల్లాకు చెందిన 19 ఏండ్ల శ్వేత ఈ నెల 12న జరిగిన నీట్ పరీక్షకు హాజరైంది. శుక్రవారం జవాబు కీని ఆమె చూసుకున్నది. రెండోసారి నీట్ రాసిన ఆమె ఈసారి కూడా అర్హత సాధించలేనన్న ఆందోళనతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. తమ కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపుపై సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఇటీవల ఒక బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. నీట్ రద్దయ్యేంత వరకు పోరాడతామన్న ఆయన ఆత్మహత్య వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, నిరాశ చెందవద్దని విద్యార్థులకు సూచించారు.
కాగా, నీట్ సాధించడంపై విద్యార్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న డీఎంకే ప్రభుత్వం 24 గంటలు పని చేసే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఆందోళనలో ఉన్న విద్యార్థులు 104 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మానసిక వైద్యుల సహాయం పొందవచ్చని తెలిపింది. దీని కోసం 330 మంది నిపుణులను నియమించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడవద్దని తమిళ నటుడు సూర్య కూడా సూచించారు. విద్యార్థులు తీసుకునే కఠిన నిర్ణయం వారి తల్లిదండ్రులకు జీవిత శిక్ష వంటిదని అన్నారు. తాను కూడా చాలా పరీక్షల్లో ఫెయిల్ అయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. పరీక్షల కంటే జీవితంలో ఎన్నో ఉన్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

