జీతం కట్.. జాగ్రత్త! ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వ సీఎస్ హెచ్చరిక
చెన్నై : ఈ నెల 28, 29 తేదీల్లో వర్తక సంఘాలు నిర్వహించనున్న జాతీయస్థాయి ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే జీతం కట్ చేస్తామని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. అఖిల భారత స్థాయిలోని కొన్ని వర్తక సంఘాలు డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జాతీయ స్థాయిలో ఈ నెల 28, 29 తేదీల్లో పోరాటానికి దిగుతున్నట్లు ప్రకటించాయి. ఈ పోరాటంలో రాష్ట్రంలోని కొన్ని గుర్తింపు పొందని సంఘాల సభ్యులు కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.
ఈ ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, పాల్గొనేలా ఇతర ఉద్యోగులను భయాందోళనకు గురిచేయడం, ఆ పోరాటానికి మద్దతు పలికేలా వ్యవహరించడం ఎంతమాత్రం తగదని సర్క్యూలర్‌లో సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయ విధులకు ఇబ్బంది కలిగించినా .. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలను అతిక్రమించినట్లు పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అన్ని కార్యాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని కలెక్టర్లను కోరారు.
ఈ రెండు రోజుల్లో ఎవరైనా కార్యాలయానికి హాజరుకాకుంటే అనుమతి లేకుండా సెలవు తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రెండు రోజుల జీతం కట్ చేస్తామని చెప్పారు. ఈ రెండు రోజులు మెడికల్ లీవు తప్ప మరేరకమైన సెలవు ఇవ్వరాదని ఆదేశించారు. అన్ని శాఖ అధిపతులు 28, 29 తేదీల్లో తమ కింది సిబ్బంది హాజరుపై ఉదయం 10.15 గంటల కల్లా నివేదిక సమర్పించాలని సూచించారు. చెన్నై సచివాలయంలోని అధికారులు కూడా ఉదయం 10.30 గంటల కల్లా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు ఇదే నివేదికను అందజేయాలని ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

