Tamil Nadu Election : తమిళనాడు (Tamil Nadu) లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని అధికార డీఎంకే (DMK) కూటమి మరోసారి ఘన విజయం సాధించనుందని ప్రీపోల్ సర్వేలు (Pre Poll Surveys) స్పష్టంచేశాయి. సర్వే చేసిన రెండు సంస్థలూ డీఎంకేనే విజయం వరించనుందని ప్రకటించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విపక్షాల ఓట్ల చీలిక డీఎంకేకు భారీ లాభం చేకూర్చనున్నాయని సర్వేలు (Surveys) అంచనా వేశాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాలల్లో అల్పహారం లాంటి పథకాలు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయని సర్వేలు అభిప్రాయపడ్డాయి.
లోక్‌పోల్ అనే సర్వే సంస్థ మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 మధ్య 1,17,000 మందితో నిర్వహించిన సర్వే ప్రకారం… మొత్తం 234 స్థానాలకుగాను డీఎంకే కూటమి 181 నుంచి 189 సీట్లు గెలుచుకుంటుంది. డీఎంకే కూటమికి 40.1 శాతం ఓట్లు వస్తాయి. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లకు పరిమితం కానుంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ పార్టీ 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలు దక్కించుకోనుంది.
The most wanted #TamilNadu Survey is Out!
Here’s the vote share & seat projection from our mega ground survey:
▪️DMK+ 181–189 | 40.1%
▪️ADMK+ 38–42 | 29%
▪️TVK 8–10 | 23.9%
▪️NTK 00 | 4.9%
▪️Others 00 | 2.1%Sample size:… pic.twitter.com/5CuGQMwKpP
— Lok Poll (@LokPoll) April 1, 2026
మరోవైపు పోల్ ట్రాకర్ నిర్వహించిన సర్వే కూడా డీఎంకే కూటమికే పట్టం కట్టింది. ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమి 42.7 శాతం ఓట్లతో 172 నుంచి 178 స్థానాల్లో గెలుపొందనుంది. అన్నాడీఎంకే 46 నుంచి 52 సీట్లతో సరిపెట్టుకుంటుంంది. విజయ్ టీవీకే పార్టీ 19.2 శాతం ఓట్లతో 6 నుంచి 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక నాయకత్వం విషయంలోనూ ఎడప్పాడి పళనిస్వామి, విజయ్‌లతో పోలిస్తే అనుభవజ్ఞుడైన నేతగా స్టాలిన్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని పోల్ట్రాకర్ పేర్కొన్నది.
Poll Tracker’s #TamilnaduElection2026 survey:
Seats and Vote %:
DMK: 172 – 178 (42.7%)
ADMK: 46 – 52 (30.3%)
TVK: 6 – 12 (19.2%)
NTK: 0 – 2 (5.1%)
OTH: 0 (2.8%)Verdict: Clear edge for DMK alliance. pic.twitter.com/zc6rDYiWBO
— Poll Tracker (@PollTracker) April 2, 2026