తమిళనాడు ;తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఉదయనిధికి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖలు కేటాయించారు. ఇక మీదట తాను సినిమాల్లో నటించనని, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో 2023లో విడుదలయ్యే మామన్నన్ తన చివరి సినిమా అని ప్రకటించారు. కుటుంబ రాజకీయాలంటూ తనపై వస్తున్న విమర్శలేవీ కొత్త కాదని, తన పనితోనే ఈ విమర్శలకు జవాబిస్తానన్నారు. తమిళనాడును దేశానికి క్రీడా రాజధానిగా మార్చడమే తన లక్ష్యమన్నారు.