Tamilanadu Assembly : అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
Tamilanadu Assembly :కేంద్రం తీసుకొచ్చిన కొత్త మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. శనివారం సభ కొలువుదీరగానే...

చెన్నై : కేంద్రం తీసుకొచ్చిన కొత్త మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ తమిళనాడు అసెంబ్లీ (Tamilanadu Assembly) తీర్మానం చేసింది. శనివారం సభ కొలువుదీరగానే తొలుత అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స్టాలిన్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేశాయి.
తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఎంకే స్టాలిన్ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం వాటిని ఏకపక్షంగా ఆమోదించిందని అన్నారు. ఈ మూడు చట్టాలు దేశంలో వ్యవసాయ వృద్ధికి లేదా రైతులకు సహాయపడవని చెప్పారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాకుండా నిరోధించాలంటే ముందుగా ఈ చట్టాలను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
తమిళనాడు చరిత్రలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగం, రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను తన ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. రైతులు చేస్తున్న శాంతియుత ఆందోళనలకు మద్దతుగా ఈ తీర్మానం చేస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. అదేవిధంగా, గత ఏడాదిగా ఆందోళన చేస్తున్న రైతులపై దాఖలైన అన్ని రకాల కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.
తమిళనాడు ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగానే బీజేపీ, ఏఐఏడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఏఐఏడీఎంకే డిప్యూటీ లీడర్ పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల్లోని చెడును చెప్పిన ముఖ్యమంత్రి స్టాలిన్.. వాటిలోని మంచి అంశాలను కూడా చెప్తే సంతోషించేవారమన్నారు. కాగా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకే తీర్మానం తీసుకొచ్చామని డీఎంకే సభ్యులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క రోజే కోటి డోసులు : డబ్ల్యూహెచ్ఓ అభినందన
అసోంలో మళ్లీ హింసాకాండ : ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం
చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

