‘స్విఫ్ట్’ ఆంక్షలతో రష్యాను దెబ్బతీయనున్న నాటో? ఉక్రెయిన్‌తో వివాదమే కారణం?
Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం ముదిరిపోతోంది. ఓ రకంగా యుద్ధ వాతావరణం అలుముకుంది. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకుంటోందని, ఏ క్షణంలోనైనా

Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం ముదిరిపోతోంది. ఓ రకంగా యుద్ధ వాతావరణం అలుముకుంది. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకుంటోందని, ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను రష్యా తోసిపుచ్చింది. అలాంటిదేమీ లేదని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అమెరికా సారథ్యంలోని నాటో తేల్చి చెప్పింది. అంతేకాకుండా కఠినాతికఠినమైన ఆర్థికపరమైన ఆంక్షలు కూడా రష్యాపై విధిస్తామని నాటో తీవ్రంగా హెచ్చరించింది. అయితే ఏ రకమైన ఆర్థిక ఆంక్షలను నాటో విధిస్తుందన్న చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించాలన్న ప్రతిపాదన నాటో ముందు ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై యూరోపియన్ దేశాలు ఇప్పటికే అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
స్విఫ్ట్ అంటే…?
అంతర్జాతీయ సంస్థ. 200 దేశాలు భాగస్వామ్యం కలిగి వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా3,500 షేర్హోర్డర్లు వున్నారు. వీరే ఈ ఫైనాన్స్ సంస్థను నడుపుతారు. 1973 లో దీనిని ఏర్పాటు చేశారు. టెలెక్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఏర్పాటు చేశారు. మొత్తం 11,000 ఫైనాన్స్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను అనుసంధానిస్తూ ఇది ఏర్పడింది.

ఆంక్షల నిబంధనలు స్విఫ్ట్‌కు వర్తిస్తాయా?
స్విప్ట్ కు ఆంక్షల నిబంధనలన్నీ వర్తిస్తాయి. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలపై ఈ ఆంక్షలు వర్తించేలా చూసే బాధ్యత మాత్రం సదురు సంస్థలదే. ఒక అంతర్జాతీయ సంస్థగా ఆంక్షలపై నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఈ స్విఫ్ట్ సంస్థకు లేదు. దేశాలపై, వ్యక్తులపై, సంస్థలపై ఆంక్షలు విధించాలన్నా, తొలగించాలన్నా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, అధికారులకే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.
బ్యాంకులను స్విఫ్ట్ బహిష్కరిస్తుందా?
2012 మార్చిలో ఇరాన్‌పై ఆంక్షలను తీవ్రతరం చేసే చర్యల్లో భాగంగా యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించిన ఇరానియన్ బ్యాంకులకు ఆర్థిక సహాయం అందించకుండా స్విఫ్ట్‌పై నిషేధం విధించారు. యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బెల్జియం చట్టాల ద్వారా ఏర్పడిన స్విఫ్ట్.. ఆ దేశం ఈయూ నిబంధనలను అంగీకరించడంతో స్విఫ్ట్ కూడా వీటిని అమలు చేయాల్సి వచ్చింది. దీనిలో భాగంగా ఈయూ ఆంక్షలు విధించిన ఇరానియన్ బ్యాంకుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగిస్తే ఏలాంటి ప్రభావం పడుతుందంటే
స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగిస్తామని నాటో బెదిరిస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే రష్యాకు విదేశీ కరెన్సీ అందదు. దీంతో రష్యా ఆర్థికంగా దెబ్బతింటుంది. రష్యాపై ఆధారపడ్డ యూరప్ దేశాలతో చమురు, సహజవాయువు, గ్యాస్, లోహాలు లాంటివి యూరప్ దేశాలకు అందవు. ఈ స్విఫ్ట్ నుంచి తొలగించడం వల్ల రష్యాలోని ఆర్థిక సంస్థలకు ఎవరూ డబ్బులు పంపలేరు. రష్యా కూడా లావాదేవీలు చేయలేదు. దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ పతన స్థితికి చేరుకుంటుంది. గతంలో స్విఫ్ట్ ఇరానియన్ బ్యాంకులపై ఆంక్షలు అమలు చేసినప్పుడు చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో ఇరాన్‌కు మూడో వంతు పైగా నష్టమే వచ్చింది. ముఖ్యంగా విదేశీ వాణిజ్యంలో దెబ్బతింది. ఇదే పరిస్థితి రష్యాకూ ఎదురయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
2014 లో క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. అప్పుడు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఆంక్షల నేపథ్యంలో సొంత ఆర్థిక లావాదేవీల కోసం ఓ వ్యవస్థను రూపొందించుకుంది. ఎస్‌పీఎఫ్‌ఎస్ (సిస్టమ్ ఆఫ్ ట్రాన్సర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్) ద్వారా ఈ చెల్లింపులను చేసుకుంటోంది. ఇప్పటికే ఈ వ్యవస్థకు 400 మంది యూజర్స్ ఉన్నారు. దాదాపు దేశీయ లావాదేవీల్లో 20 శాతం దీనిద్వారానే జరుగుతున్నాయి . అంతేకాకుండా చైనాకు సంబంధించిన క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేవ్మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

