ఆ ఎస్పీ నేత నాలుక కోస్తే రూ. 10 లక్షల రివార్డు : యూపీ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
హిందుత్వం ఓ బూటకమని వ్యాఖ్యానించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత స్వామి ప్రసాద్ మౌర్యపై యూపీ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
లక్నో : హిందుత్వం ఓ బూటకమని వ్యాఖ్యానించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత స్వామి ప్రసాద్ మౌర్యపై యూపీ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య నాలుక కోసిన వారికి రూ. 10 లక్షల నగదు అందచేస్తానని కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల విభాగం చీఫ్ పండిట్ గంగారాం శర్మ పేర్కొన్నారు. మౌర్య హిందూ మతాన్ని కించపరచడంతో పాటు రామచరిత్‌మానస్‌ను అవమానించారని మండిపడ్డారు.
మౌర్య నాలుక కోసిన వారికి రూ. 10 లక్షల నగదు రివార్డును ప్రకటిస్తూ శర్మ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా హిందూయిజం బూటకమని, మోసపూరితమని మౌర్య గత వారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. సమాజంలో అన్ని అసమానతలకు బ్రాహ్మణిజం కారణమని కూడా మౌర్య పేర్కన్నారు.
సమాజంపై బ్రాహ్మణవాదం చాలా లోతుగా వేళ్లూనుకుందని, అసలు హిందూ మతమే లేదని, ఇదంతా బూటకమని అన్నారు. సమాజంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల ప్రజలను అణగదొక్కేందుకు బ్రాహ్మణ మతాన్నే హిందూ మతంగా రుద్దారని వ్యాఖ్యానించారు. హిందూ మతమే ఉంటే దళితులు, బీసీలు, గిరిజనులకు గౌరవం దక్కేదని కానీ అలా జరగడం లేదని మౌర్య పేర్కొన్నారు.
Read More :
Rakhi Festival | రేపే రాఖీ పండుగ.. వినాయక చవితిపై కూడా క్లారిటీ ఇచ్చిన బ్రాహ్మణ సేవాసమితి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

