Baramati | బారామతిలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లో సీసీటీవీలు ఆఫ్
మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయని, ఆ సమయంలో ఏదో జరిగిందని ఎన్సీపీ (ఎస్పీ) ఆరోపించింది. ఈ నియోజకవర్గంలో ఈ నెల 7న పోలింగ్ జరిగింది.
Baramati | పుణే : మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయని, ఆ సమయంలో ఏదో జరిగిందని ఎన్సీపీ (ఎస్పీ) ఆరోపించింది. ఈ నియోజకవర్గంలో ఈ నెల 7న పోలింగ్ జరిగింది. బారామతిలో ఎన్సీపీ(ఎస్పీ) తరఫున శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తుండగా, ఎన్సీపీ(అజిత్ వర్గం) నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బరిలో నిలిచారు.
సుప్రియ సూలే తరపున ఎన్నికల ప్రతినిధి లక్ష్మీకాంత్ ఖబియా మాట్లాడుతూ, బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఉపయోగించిన ఈవీఎంలను భద్రపరచిన ఎఫ్‌సీఐ గోదాములో సోమవారం ఉదయం 45 నిమిషాలు సీసీటీవీ కెమెరాలు పని చేయలేదన్నారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని చెప్పారు. బారామతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కవిత ద్వివేది మాట్లాడుతూ, ఎన్సీపీ (ఎస్పీ) చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామన్నారు. ఈవీఎంలను భద్రపరచిన గోదాములోని ఓ కేబుల్‌ను ఎలక్ట్రీషియన్ తొలగించారని, ఫలితంగా డిస్ప్లే యూనిట్ షట్ డౌన్ అయిపోయిందని చెప్పారు. కెమెరాలన్నీ పని చేస్తున్నాయని, డాటా పూర్తిగా ఉందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

