Udhayanidhi Stalin: మాట్లాడేటపుడు తెలియదా?.. ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఉదయనిధి పిటీషన్‌ను విచారించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ కోర్టును ఎలా ఆశ్రయిస్తున్నారని సుప్రీం బెంచ్ తీవ్రంగా ప్రశ్నించింది. మీరు మాట్లాడే మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉండాలని కోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఉదయనిధి పిటీషన్‌ను విచారించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ కోర్టును ఎలా ఆశ్రయిస్తున్నారని సుప్రీం బెంచ్ తీవ్రంగా ప్రశ్నించింది. మీరు మాట్లాడే మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉండాలని కోర్టు తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం మీరు మీకు హక్కును దుర్వినియోగం చేశారని, ఆర్టికల్ 25 ప్రకారం కూడా దుర్వినియోగం చేశారని, కానీ ఇప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం మీరు సుప్రీంలో పిల్ దాఖలు చేశారని, మీరు మాట్లాడిన మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా, మీరేమీ సాధారణ వ్యక్తి కాదు అని, మీరు మంత్రి అని, మాటల పర్యవసానాలు తెలిసి ఉండాలని సుప్రీం బెంచ్ తెలిపింది.
ఈ కేసును మార్చి 15వ తేదీకి వాయిదా వేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సనాతనం ధర్మంపై స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకం అన్నారు. దాన్ని నిర్మూలించాలన్నారు. ఆ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారాయన.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

