గుజరాత్ వంతెన ప్రమాదంపై 14న సుప్రీంకోర్టు విచారణ
Gujarat bridge collapse | గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారి
న్యూఢిల్లీ : గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారి ఈ పిటిషన్ను సోమవారం దాఖలు చేశారు. వంతెన కూలిన ఘటనలో వందకుపైగా ప్రాణాలు కోల్పోయారని, ఇందులో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, పూర్తి వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందని పిటషనర్ ఆరోపించారు.
గత దశాబ్దం నుంచి దేశంలో వివిధ సంఘటనలు జరిగాయని, వీటిలో నిర్వహణ లోపం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, లోపాల కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించిన సందర్భాలున్నాయని, వీటిని నివారించవచ్చని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ఎదుట మంగళవారం న్యాయవాది విశాల్ తివారి వాదనలు విపించారు. పిటిషన్పై ప్రార్థన ఏంటని? సీజేఐ జస్టిస్ లలిత్ న్యాయవాదిని ప్రశ్నించగా.. తివారి స్పందిస్తూ న్యాయ విచారణ కమిషన్ను కోరుతున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఈ నెల 14న పిటిషన్ జాబితా చేయాలని ఆదేశించారు. ఈ నెల 30న మోర్బీలో మచ్చు నదిపై వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న తీగల వంతెనను కొద్ది రోజుల కిందట మరమ్మతుల నేపథ్యంలో మూసివేశారు. ఈ బాధ్యతలను ఒరేవా గ్రూప్కు అప్పగించారు. గతవారంలో వంతెనను తిరిగి ప్రారంభించగా.. కూలిపోయింది.
500 మంది సందర్శకులు వంతెనపైకి చేరుకోగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే
వంతెనను తిరిగి ప్రారంభించిన సమయంలో ప్రైవేట్ ఆపరేటర్ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్
తీసుకోలేదని, అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పిటిషన్లో పేర్కొన్నారు. భద్రతపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని, ఇది భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘననని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘించడమేనని పిటిషన్లో తివారి ఆరోపించారు.
భవిష్యత్లో ఇలా ప్రాణనష్టం జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, పురాతన, ప్రమాదకర స్మారక చిహ్నాలు, వంతెనలు తదితర వాటి వద్ద ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అలాగే ఇలాంటి కేసులలో సత్వర దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

