న్యూఢిల్లీ: వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque )లోని శివలింగంపై కార్బన్ డేటింగ్ అవసరంలేదని సుప్రీంకోర్టు తెలిపింది. శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే వరకు ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నది. శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న అంశాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలిచాలని కోర్టు అభిప్రాయపడింది.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో .. సర్వే నిర్వహిస్తున్న సమయంలో శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. 2022లో వీడియోగ్రఫీ సర్వే చేస్తున్న సమయంలో ఆ లింగం కనిపించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం అడ్డుకుంది.