Supreme Court | డార్విన్, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను సవాల్ చేస్తూ పిల్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
Supreme Court | డార్విన్, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే ఈ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ భావిస్తే కోర్టు ఏం చేయగలదు? అని ధర్మాసనం ప్రశ్నించింది. మీరే సొంతంగా సిద్ధాంతాలు రూపొందించుకోవాలని సూచించింది.
న్యూఢిల్లీ: డార్విన్, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే ఈ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ భావిస్తే కోర్టు ఏం చేయగలదు? అని ధర్మాసనం ప్రశ్నించింది. మీరే సొంతంగా సిద్ధాంతాలు రూపొందించుకోవాలని సూచించింది. ఆ పిల్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని పేర్కొంటూ తిరస్కరించింది.
ఐన్‌స్టీన్ సాపేక్షత సమీకరణ సిద్ధాంతం E = mc², మనిషి జీవన పరిణామానికి సంబంధించిన డార్విన్ సిద్ధాంతాన్ని సవాల్ చేస్తూ రాజ్‌కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను స్కూల్, కాలేజీలో చదివిన ఈ సిద్ధాంతాలు తప్పని పిల్లో పేర్కొన్నాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని ఆరోపించాడు. డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మి లక్షలాది మంది చనిపోయారని కోర్టుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు సిద్ధాంతాలు తప్పని నిరూపించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరాడు.
న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిల్‌పై విచారణ జరిపింది. ఈ సిద్ధాంతాలు తప్పని భావిస్తే వాటిని మెరుగుపర్చాలని పిటిషనర్‌కు సూచించింది. ఇందులో కోర్టు ఏం చేస్తుందని ప్రశ్నించింది. ‘సైన్స్ స్టూడెంట్ను, స్కూల్లో ఏదో చదివానని అంటున్నావు. ఇప్పుడు ఆ సిద్ధాంతాలు తప్పని అని అంటున్నావు. చాలా ఏళ్ల నాటి ఆ సిద్ధాంతాలు తప్పని అని నువ్వు నమ్మితే దానికి సర్వోన్నత న్యాయస్థానం ఏమి చేస్తుంది? ఆర్టికల్ 32 ప్రకారం మీ ప్రాథమిక హక్కుకు ఏం ఉల్లంఘన జరిగింది?’ అని ప్రశ్నించింది. ‘నువ్వు నీ సొంత థియరీని ప్రతిపాదించుకుని ప్రచారం చేసుకో’ అని సూచిస్తూ ఆ పిల్‌ను కొట్టివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- challenging
- darwin
- Einstein
- plea
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

