గంభీర్‌కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై డ్రగ్ కంట్రోలర్ శాఖ దాఖలు చేసిన కేసులో స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అక్రమ రీతిలో కోవిడ్ ఔషధాలను నిల్వ చేసినట్లు గంభీర్ ఫౌండేషన్‌పై డ్రగ్ కంట్రోలర్ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో విచారణను నిలిపివేయాలని గంభీర్ తరపున లాయర్ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో గంభీర్ ఫౌండేషన్ సుమారు రెండు వేలకు పైగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను పంచిపెట్టింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిస్తూ.. ఆ కేసులో మేం స్టే ఇవ్వలేమని, ఢిల్లీ హైకోర్టు ముందు మీ వాదనలు ఇవ్వాలంటూ పేర్కొన్నది. డ్రగ్స్, కాస్మటిక్స్ యాక్ట్ ప్రకారం గంభీర్ ఫౌండేషన్‌పై కేసు దాఖలు చేశారు. ఫాబీఫ్లూ, ఆక్సిజన్‌ను అక్రమంగా నిల్వ చేసినట్లు గంభీర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఫౌండేషన్‌తో పాటు అనైతిక రీతిలో ఔషధాలను అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

